పేదల చైతన్యం కోసమే జాషువా సాహిత్యం – కౌన్సిలర్‌ గాదెపాక రవీందర్‌

హుస్నాబాద్‌, సెప్టెంబరు 28 (చైతన్యగళం): బడుగు, బలహీనవర్గాల జీవితాల్లో చైతన్యం నింపేందుకు గుర్రం జాషువా తన సాహిత్యాన్ని వినియోగించారని కౌన్సిలర్‌ గాదెపాక రవీందర్‌ అన్నారు. జాషువా 132వ జయంతి సందర్భంగా సోమవారం జనజాగృతి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రవీందర్‌ మాట్లాడుతూ.. సామాజికంగా వెనుకబడిన వర్గంలో జన్మించిన జాషువా కష్టపడి చదువుకుని సాహిత్యాన్ని అభ్యసించి ఎన్నో అద్భుతమైన రచనలు చేశారని తెలిపారు. కష్టజీవుల కన్నీళ్లను తన కవితా వస్తువుగా మలిచి, వారి సమస్యల పరిష్కారానికి తన రచనల ద్వారా...