CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 9:04 pm Posted by : CHAITHANYA GALAM NEWS

పేదల చైతన్యం కోసమే జాషువా సాహిత్యం – కౌన్సిలర్‌ గాదెపాక రవీందర్‌

హుస్నాబాద్‌, సెప్టెంబరు 28 (చైతన్యగళం): బడుగు, బలహీనవర్గాల జీవితాల్లో చైతన్యం నింపేందుకు గుర్రం జాషువా తన సాహిత్యాన్ని వినియోగించారని కౌన్సిలర్‌ గాదెపాక రవీందర్‌ అన్నారు. జాషువా 132వ జయంతి సందర్భంగా సోమవారం జనజాగృతి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రవీందర్‌ మాట్లాడుతూ.. సామాజికంగా వెనుకబడిన వర్గంలో జన్మించిన జాషువా కష్టపడి చదువుకుని సాహిత్యాన్ని అభ్యసించి ఎన్నో అద్భుతమైన రచనలు చేశారని తెలిపారు. కష్టజీవుల కన్నీళ్లను తన కవితా వస్తువుగా మలిచి, వారి సమస్యల పరిష్కారానికి తన రచనల ద్వారా నిరంతరం కృషి చేశారని పేర్కొన్నారు.

కార్యక్రమంలో జనజాగృతి కళాసమితి అధ్యక్షుడు ముక్కెర సంపత్‌కుమార్‌, జేఏసీ సమన్వయకర్త మేకల వీరన్నయాదవ్‌, దళిత బహుజన సంఘాల నాయకులు వేల్పుల రాజు, బోధి శంకర్‌ దమ్మాచారి, మెతుకు కొమురయ్య, అంబాల బిక్షపతి, అధ్యాపకులు అర్షం జనార్ధన్‌, దేవర కనకయ్య, బాలసాని దామోదర్‌ తదితరులు పాల్గొన్నారు.