ఎంబీబీఎస్‌ సీటు సాధించిన విద్యార్థినికి గోలి శ్రీనివాస్‌రెడ్డి ఆర్థికసాయం

వెల్దండ, సెప్టెంబరు 28 (చైతన్యగళం): మండలంలోని చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన దువాసి సన్యా ఎంబీబీఎస్‌ సీటు సాధించడంతో తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌రెడ్డి ఆమెను అభినందించి రూ.10 వేల ఆర్థికసాయం అందించారు. సన్యా తల్లిదండ్రులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు, మాజీ ఎంపీటీసీ నాగులునాయక్‌ కూడా రూ.5 వేల సాయం అందించారు. సన్యా వైద్య విద్యలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పుట్ట రాంరెడ్డి, మాజీ...