జూపల్లిలో ఘనంగా గ్యార్మి ఉత్సవాలు
ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి చారకొండ, సెప్టెంబరు 28 (చైతన్యగళం): మండలంలోని జూపల్లి గ్రామంలో సోమవారం గ్యార్మి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గ్రామస్థులకు గ్యార్మి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. గ్రామస్థులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన వారి ఆప్యాయతను స్వీకరించారు. కార్యక్రమంలో వెల్దండ మండల అధ్యక్షుడు పుట్ట రామిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ అనిల్‌కుమార్, మాజీ ఉపసర్పంచ్ జంగిలి నిరంజన్, జిల్లా...