టీజీ సేఫ్‌ డ్రగ్స్‌ విభాగం డైరెక్టర్‌గా జి. రాంధన్‌

జాయింట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తూ పదోన్నతి హైదరాబాద్‌, సెప్టెంబరు 28(చైతన్యగళం): తెలంగాణ స్టాండర్డ్స్‌ అథారిటీ ఫర్‌ సేఫ్‌ ఫుడ్‌ అండ్‌ ఎసెన్షియల్‌ డ్రగ్స్‌ (టీజీ సేఫ్‌) డ్రగ్స్‌ విభాగం డైరెక్టర్‌గా జి. రాంధన్‌ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇదే విభాగంలో జాయింట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం డైరెక్టర్‌గా నియమించింది. సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనంతరం ఖాళీగా ఉన్న డ్రగ్స్‌ విభాగం డైరెక్టర్‌ పోస్టును ప్రభుత్వం పునఃసృష్టించింది. ఈ పదవిలో నియమితులైన తొలి అధికారిగా జి. రాంధన్‌ బాధ్యతలు చేపట్టారు....