వెంకన్న గుప్త జ్ఞాపకార్థం వైకుంఠధామానికి బోరు

గ్రామాభివృద్ధికి దాతలు ముందుకు రావాలి: సర్పంచ్ రెంటాల కృష్ణ, మాజీ జడ్పీటీసీ అంబటి వీరభద్రం గౌడ్ కురవి, సెప్టెంబర్ 28(చైతన్యగళం): గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావడానికి దాతలు ముందుకు రావాలని కురవి మండలం నల్లెల్ల గ్రామ సర్పంచ్ రెంటాల కృష్ణ, మాజీ జడ్పీటీసీ అంబటి వీరభద్రం గౌడ్ పిలుపునిచ్చారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నల్లెల్ల గ్రామానికి చెందిన ప్రొద్దుటూరి వెంకన్న గుప్త జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు చేపట్టిన సేవా కార్యక్రమాన్ని వారు అభినందించారు. వెంకన్న గుప్త జ్ఞాపకార్థం ఆయన ఆరుగురు కుమారులు, వారి...