భగత్‌సింగ్‌ త్యాగాలు యువతకు స్ఫూర్తిదాయకం

దేశానికి మనమేం చేయగలమో ఆలోచించాలి: మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ కరీంనగర్‌, సెప్టెంబరు 28 (చైతన్యగళం): భగత్‌సింగ్‌ త్యాగాలు, ధైర్యసాహసాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని కరీంనగర్‌ మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ అన్నారు. ‘నా దేశం.. నా జాతి.. నా బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా సోమవారం మేయర్‌ క్యాంపు కార్యాలయంలో భగత్‌సింగ్‌ జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి తాను ఏమి ఇవ్వగలననే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండాలని మేయర్‌ అన్నారు. చిన్న వయసులోనే జలియన్‌వాలాబాగ్‌ ఘటనతో ప్రభావితమైన భగత్‌సింగ్‌ స్వాతంత్ర్య సాధన...