- సీఎం చేతుల మీదుగా ఈనెల 30న ప్రారంభం
కరీంనగర్, సెప్టెంబరు 28 (చైతన్యగళం): ఈనెల 30న ముఖ్యమంత్రి చేతుల మీదుగా కరీంనగర్ జిల్లా ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్ చిత్రా మిశ్రా పరిశీలించారు. అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు.
ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాట్లు పూర్తి చేయాలని, శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయడంతోపాటు అలంకరణ, విద్యుద్దీపాలు, పారిశుద్ధ్య ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్వో స్వామి, ఆర్డీవో షర్మిల, వివిధ శాఖల అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.