భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన మీడిదం వెంకటేశ్వరరావు–వనజ దంపతులు
వినాయకుడికి ప్రత్యేక పూజలు జమ్మిగడ్డ (చైతన్యగళం): కాప్రా మున్సిపాలిటీ పరిధిలోని జమ్మిగడ్డలో భాగత్‌సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో శుక్రవారం సాయంత్రం మీడిదం వెంకటేశ్వరరావు–వనజ దంపతులు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దంపతులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని పూజించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, బంధుమిత్రులు, స్థానికులు పాల్గొని విఘ్నేశ్వరుడి ఆశీస్సులు పొందారు.