చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శనీయం – కరీంనగర్ సీపీ గౌష్ ఆలం

కరీంనగర్, సెప్టెంబర్ 26 (చైతన్య గళం): తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపీఎస్ చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం భూస్వామ్య శక్తులకు ఎదురొడ్డి నిలిచిన అసమాన ధైర్యశాలి చాకలి ఐలమ్మ...