కథలు సమాజ మార్పుకు శక్తివంతమైన సాధనాలు

కరీంనగర్, సెప్టెంబర్ 27 (చైతన్యగలం): కథలు మనిషి ఆలోచనా సరళిని, సమాజ పోకడలను మార్చే శక్తివంతమైన సాధనాలని, వ్యక్తిగతంగా మనిషిని తీర్చిదిద్దడంలోనూ, సామాజికంగా మార్పు తీసుకురావడంలోనూ కథలు కీలక పాత్ర పోషిస్తాయని తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ సంచాలకులు జి.వి. శ్యాం ప్రసాద్ లాల్ పేర్కొన్నారు. జాతీయ సాహిత్య పరిషత్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా తన తండ్రి పేరిట ఇచ్చే రజనీశ్రీ సాహిత్య పురస్కార సభలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ‘విత్తనం’ కథా సంపుటి రచించిన పెద్దింటి...