‘మన్ కీ బాత్’ కేవలం రేడియో ప్రసంగం కాదు – మన్ కీ బాత్ ప్రజాగొంతుక: బీజేపీ నేత కుమారస్వామి
రంగారెడ్డి , సెప్టెంబరు 27 (చైతన్యగళం): నాదర్‌గుల్ డివిజన్, బడంగ్‌పేట్ సర్కిల్ పరిధిలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 138వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలతో కలిసి వీక్షించారు. కార్యక్రమానికి బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారోజు కుమారస్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. ‘మన్ కీ బాత్’ కేవలం రేడియో ప్రసంగం కాదని, ప్రజల గొంతుకగా నిలుస్తోందన్నారు. కార్యక్రమంలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు అక్టోబరు 2న గాంధీ...