CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 4:48 pm Posted by : CHAITHANYA GALAM NEWS

‘మన్‌ కీ బాత్‌’ కేవలం రేడియో ప్రసంగం కాదు – మన్‌ కీ బాత్‌ ప్రజాగొంతుక: బీజేపీ నేత కుమారస్వామి

రంగారెడ్డి , సెప్టెంబరు 27 (చైతన్యగళం): నాదర్‌గుల్‌ డివిజన్‌, బడంగ్‌పేట్‌ సర్కిల్‌ పరిధిలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 138వ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలతో కలిసి వీక్షించారు. కార్యక్రమానికి బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారోజు కుమారస్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. ‘మన్‌ కీ బాత్‌’ కేవలం రేడియో ప్రసంగం కాదని, ప్రజల గొంతుకగా నిలుస్తోందన్నారు. కార్యక్రమంలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు అక్టోబరు 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని చేపట్టాల్సిన స్వచ్ఛత కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిపారు.

సేవా సంకల్ప్‌ అభియాన్‌లో భాగంగా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. సెప్టెంబరు 29న వృద్ధాశ్రమాలు, దివ్యాంగుల సేవ; అక్టోబరు 4న రోడ్డు భద్రత, రవాణా అవగాహన; అక్టోబరు 9న అవయవదానంపై అవగాహన; అక్టోబరు 11న గ్రామం, బస్తీ దత్తత, సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు.

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, ఆయుష్మాన్‌ భారత్‌, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన వంటి పథకాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కుమారస్వామి కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు, ‘మన్‌ కీ బాత్‌’ కన్వీనర్‌ చికూరి రాంబాబు, సీనియర్‌ నాయకులు మహేందర్‌రెడ్డి, వెంకటయ్య, సంతోష్‌నాయక్‌, యాదయ్య యాదవ్‌, రామారావు, గణేష్‌నాయక్‌, రాజుగౌడ్‌, చరణ్‌, సాగర్‌బాబు, రాఘవేందర్‌గుప్త తదితరులు పాల్గొన్నారు.