CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 7:14 am Posted by : CHAITHANYA GALAM NEWS

భవ్య మృతి ఘటనపై విద్యాశాఖ చర్యలు

  • కేజీబీవీ ప్రిన్సిపాల్‌ విధుల నుంచి తొలగింపు: డీఈఓ జనార్దన్‌రెడ్డి

కొత్తపల్లి, సెప్టెంబరు 27 (చైతన్యగళం‌): కొత్తపల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం విద్యార్థిని భవ్య మృతి ఘటనపై విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఘటనపై నిర్వహించిన విచారణలో విద్యార్థినుల భద్రత, పర్యవేక్షణ విషయంలో ప్రిన్సిపాల్‌ కృష్ణాబాయి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించినట్లు నంద్యాల జిల్లా విద్యాధికారి జనార్దన్‌రెడ్డి తెలిపారు. దీంతో ఆమెను ప్రిన్సిపాల్‌ విధుల నుంచి తొలగించినట్లు శనివారం వెల్లడించారు.

ఈ నెల 23న జరిగిన భవ్య మృతి ఘటనను విద్యాశాఖ తీవ్రంగా పరిగణించినట్లు డీఈఓ తెలిపారు. విద్యార్థినుల భద్రత విషయంలో బాధ్యతారాహిత్యాన్ని సహించబోమని పేర్కొన్నారు. కేజీబీవీల్లో విద్యార్థినుల భద్రత, పర్యవేక్షణపై నిరంతరం దృష్టి సారిస్తామని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.