విద్యానగర్‌లో రూ.70 లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారం

కరీంనగర్, సెప్టెంబర్ 26 (చైతన్య గళం): నగర ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా పాలకవర్గం పనిచేస్తుందని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. శనివారం 21వ డివిజన్ విద్యానగర్‌లో స్థానిక కార్పొరేటర్ వరాల నర్సింగంతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. యూఐడీఎఫ్ నిధులు రూ.70 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, ఎస్‌డబ్ల్యూజీ పైపులైన్ పనులకు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. పనులను వేగవంతంగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి...