ఇంటి వద్ద గంజాయి మొక్కల పెంపకం.. వ్యక్తి అరెస్ట్
మహబూబాబాద్, సెప్టెంబరు 27(చైతన్యగళం): ఇంటి వద్ద గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తిని మహబూబాబాద్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాబునాయక్‌తండాకు చెందిన గుగులోత్ మంగిలాల్ (40) ఇంటి బాత్రూమ్ సమీపంలో గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రెండు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.3 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గంజాయి విక్రయాలు, వినియోగం, అక్రమ సాగుపై సమాచారం ఉంటే...