CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 8:24 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఇంటి వద్ద గంజాయి మొక్కల పెంపకం.. వ్యక్తి అరెస్ట్

మహబూబాబాద్‌, సెప్టెంబరు 27(చైతన్యగళం): ఇంటి వద్ద గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తిని మహబూబాబాద్‌ టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాబునాయక్‌తండాకు చెందిన గుగులోత్‌ మంగిలాల్‌ (40) ఇంటి బాత్రూమ్‌ సమీపంలో గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు శనివారం తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా రెండు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.3 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

గంజాయి విక్రయాలు, వినియోగం, అక్రమ సాగుపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.