ఘనంగా ఆరుట్ల చండీశ్వర్‌ యూత్‌ వినాయక నిమజ్జనం

లడ్డూ వేలంలో రూ.1.11 లక్షల పలుకు.. చిన్న లడ్డూకు రూ.37 వేలు మంచాల, సెప్టెంబరు 27 (చైతన్యగళం): మంచాల మండలం ఆరుట్ల గ్రామంలోని చండీశ్వర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుడి నిమజ్జన కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. వివిధ వేషధారణలు, డోలు విన్యాసాలు, డప్పుల దరువులతో నిమజ్జన శోభాయాత్ర కన్నులపండువగా సాగింది. అంతకుముందు నిర్వహించిన లడ్డూ వేలం పాటలో పెద్ద లడ్డూను ఆరుట్లకు చెందిన చెరుకు పర్వతాలు రూ.1.11 లక్షలకు దక్కించుకున్నారు. చిన్న లడ్డూను చెరుకు వెంకటేష్‌ రూ.37 వేలకు కైవసం చేసుకున్నారు....