కొండా లక్ష్మణ్‌ బాపూజీకి ఘన నివాళి

హుస్నాబాద్‌ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు హుస్నాబాద్‌, సెప్టెంబరు 26 (చైతన్యగళం): హుస్నాబాద్‌ పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దండి లక్ష్మి హాజరై బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాపూజీ ఆశయాలను, సమాజ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు, మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.