నిర్వాసితుల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తాం

సిద్దిపేట, సెప్టెంబర్ 25(చైతన్యగలం): కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూములు కోల్పోయిన ఆయా గ్రామాల నిర్వాసితుల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ కె. హైమావతి తెలిపారు. శుక్రవారం ములుగు మండలం కొండపోచమ్మ సాగర్ ఆర్‌అండ్‌ఆర్ కాలనీ, గజ్వేల్ పట్టణంలోని ముట్రాజ్‌పల్లి పరిధిలో గల మల్లన్న సాగర్ ఆర్‌అండ్‌ఆర్ కాలనీలను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ రిజర్వాయర్ల ఆర్‌అండ్‌ఆర్ కాలనీల సమస్యలు చాలా కాలంగా పెండింగ్‌లో...