పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు విస్తృత ప్రచారం కల్పించాలి: కలెక్టర్ స్నేహ శబరీష్ మహబూబాబాద్, సెప్టెంబరు 26 (చైతన్యగళం): జిల్లాలోని ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి విస్తృత ప్రచారం కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శనివారం మహబూబాబాద్ మండలం కంబాలపల్లి పెద్ద చెరువు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కురవి వీరభద్రస్వామి, కందికొండ లక్ష్మీనరసింహస్వామి, నరసింహులపేట వెంకటేశ్వరస్వామి ఆలయాలతో పాటు బయ్యారం పెద్ద చెరువు, మత్తడి, భీమునిపాదం,...