CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 10:41 pm Posted by : CHAITHANYA GALAM NEWS

కబడ్డీ శిక్షణ శిబిరాన్ని సందర్శించిన శివకుమార్

  • క్రీడలతో ఆత్మవిశ్వాసం, దృఢత్వం పెంపొందుతాయి

హుస్నాబాద్‌, సెప్టెంబరు 26 (చైతన్యగళం): హుస్నాబాద్‌ మార్కెట్‌యార్డులో నిర్వహిస్తున్న సిద్దిపేట జిల్లా జూనియర్‌ కబడ్డీ జట్టు శిక్షణ శిబిరాన్ని తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం సహాయ కార్యదర్శి కుంటానోళ్ల శివకుమార్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ కేడం లింగమూర్తి శనివారం సందర్శించారు. క్రీడాకారులతో మాట్లాడి శిక్షణ, పోటీల్లో రాణించేందుకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల్లో దృఢత్వం సాధించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. కబడ్డీ క్రీడాకారులకు మంచి అవకాశాలను అందిస్తోందని, ప్రో కబడ్డీ వంటి పోటీల ద్వారా ప్రతిభకు గుర్తింపు లభిస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుత సమయాన్ని సద్వినియోగం చేసుకుని క్రీడల్లో రాణించడంతో పాటు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.

కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు గద్దల రమేష్‌, సహాయ కార్యదర్శులు నరేందర్‌, కరుణాకర్‌, కోశాధికారి సత్యం, కార్యవర్గ సభ్యులు చందు, పవన్‌, హుస్నాబాద్‌ కబడ్డీ సంఘం అధ్యక్షుడు వెన్న రాజు, కోచ్‌ మడక కృష్ణ, సీనియర్‌ క్రీడాకారులు డ్యాగాల సారయ్య, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.