పల్లె దవాఖాన వద్ద మద్యం సేవిస్తున్న వారితో ఇబ్బందులు

పోలీసులు నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని గ్రామస్థుల విజ్ఞప్తి సైదాపూర్‌, సెప్టెంబరు 26 (చైతన్యగళం): మండలంలోని ఆకునూరు పల్లె దవాఖాన పరిసరాల్లో కొందరు మద్యం సేవిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దీంతో దవాఖానకు వచ్చే రోగులు, మహిళలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దవాఖాన సమీపంలోనే గ్రామపంచాయతీ కార్యాలయం ఉండటంతో అక్కడికి వెళ్లేందుకు కూడా ప్రజలు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. బస్టాండ్‌, నిత్యావసరాల దుకాణాలకు వెళ్లే ప్రధాన మార్గం దవాఖాన ముందుగానే ఉండటంతో ప్రతిరోజూ ఈ ప్రాంతం గుండా వెళ్లాల్సి వస్తోందని గ్రామస్థులు తెలిపారు. మద్యం...