మోదీ సేవలకు ప్రజలు అండగా నిలవాలి
ప్రధాని మోదీకి ప్రజలు మద్దతుగా నిలవాలి: బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లబు వెంకటేశ్వర్లు మహబూబాబాద్, సెప్టెంబరు 26 (చైతన్యగళం): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లబు వెంకటేశ్వర్లు కోరారు. మోదీ సేవలకు ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా అభియాన్‌లో భాగంగా శనివారం మహబూబాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పట్టణ...