‘నా కలల భారత్’పై చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు
250 మంది విద్యార్థుల ఉత్సాహభరిత పాల్గొనడం హుస్నాబాద్, సెప్టెంబరు 26 (చైతన్యగళం): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా హుస్నాబాద్ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ‘నా కలల భారత్–వికసిత్ భారత్ 2047’ అంశంపై విద్యార్థులకు చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఆర్య వైశ్య భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 2047...