- 250 మంది విద్యార్థుల ఉత్సాహభరిత పాల్గొనడం
హుస్నాబాద్, సెప్టెంబరు 26 (చైతన్యగళం): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా హుస్నాబాద్ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ‘నా కలల భారత్–వికసిత్ భారత్ 2047’ అంశంపై విద్యార్థులకు చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఆర్య వైశ్య భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎలా ఉండాలన్న తమ ఆలోచనలు, ఆకాంక్షలను విద్యార్థులు చిత్రాలు, ప్రసంగాల ద్వారా వ్యక్తం చేశారు. పోటీల అనంతరం విజేతలకు స్మారక చిహ్నాలు అందజేసి అభినందించారు. విద్యార్థుల్లో దేశభక్తి, సృజనాత్మకత, దేశ నిర్మాణంపై అవగాహన పెంపొందించడమే కార్యక్రమ ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్క యశస్వి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వెంకటేష్, కార్యదర్శి పైడిపల్లి పృథ్వీరాజ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు తోట స్వరూప, పట్టణ కన్వీనర్ తగరం లక్ష్మణ్, తోట సమ్మయ్య, సీనియర్ నాయకులు లక్కిరెడ్డి తిరుమల, దొడ్డి శ్రీనివాస్, జనగామ వేణుగోపాలరావు, కాయిత శ్రీనివాస్‌రెడ్డి, శారద, రమేష్, నరేష్, సాయి, తిరుపతి, బోడిగే వెంకటేష్, బొప్పిశెట్టి సాయి, అబ్బిడి లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.