ఖైదీల హక్కుల పరిరక్షణకు న్యాయ సేవాధికార సంస్థ అండ
సబ్‌జైలులో విచారణ ఖైదీలతో ముఖాముఖి.. ప్రధాన జిల్లా న్యాయమూర్తి కె. మురళీమోహన్ మహబూబాబాద్, సెప్టెంబరు 26 (చైతన్యగళం): సమాజంలోని బలహీనవర్గాలకు న్యాయ సేవాధికార సంస్థ అండగా నిలుస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె. మురళీమోహన్ అన్నారు. శనివారం స్థానిక సబ్‌జైలును సందర్శించిన ఆయన విచారణ ఖైదీలతో ముఖాముఖి నిర్వహించి వారి హక్కులు, ఉచిత న్యాయ సహాయం, జైలు జీవితం అనంతరం బాధ్యతాయుత పౌరులుగా జీవించాల్సిన విధానంపై అవగాహన కల్పించారు. రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రతి వ్యక్తికి జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కల్పిస్తుందని...