గౌరవెల్లి ముంపు బాధిత మహిళలకు పరిహారం ఇవ్వాలి
ఆర్‌అండ్‌ఆర్ జాబితాలో 117 మంది వివాహిత మహిళలు.. హామీలు అమలు చేయాలని వినతి హుస్నాబాద్, సెప్టెంబరు 26 (చైతన్యగళం): గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన వివాహిత ముంపు బాధిత మహిళలకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద పరిహారం అందించాలని బాధితులు కోరారు. శనివారం హుస్నాబాద్ ఆర్డీఓను కలిసి తమ సమస్యను వివరించి వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వం రూపొందించిన ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ జాబితాలో 117 మంది వివాహిత మహిళలతో పాటు ఇతర బాధితులను చేర్చినట్లు వారు తెలిపారు. పరిహారం అందిస్తామని పలుమార్లు హామీలు ఇచ్చినా...