తీగలకుంటపల్లిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం: సర్పంచ్‌ స్వర్ణలత కోహెడ, సెప్టెంబరు 26 (చైతన్యగళం): మండలంలోని తీగలకుంటపల్లిలో రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రజక సంఘం అధ్యక్షుడు జాలిగాం బాలయ్య ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి, కొబ్బరికాయ కొట్టి నివాళులర్పించారు. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్‌ మ్యాకల స్వర్ణలత–సురేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం చాకలి ఐలమ్మ చేసిన...