పోలీసులపై దాడులను ఉపేక్షించేది లేదు
తానంచర్ల మాజీ సర్పంచ్ సహా ఆరుగురు అరెస్టు.. మరో 11 మందిపై కేసు మరిపెడ, సెప్టెంబరు 26(చైతన్యగళం): పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, సిబ్బందిపై దాడులకు పాల్పడటాన్ని ఉపేక్షించబోమని తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్ తెలిపారు. వినాయక నిమజ్జనం సందర్భంగా తానంచర్లలో చోటుచేసుకున్న ఘటనపై మాజీ సర్పంచ్ సహా ఆరుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు వెల్లడించారు. మరో 11 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 23, 24 తేదీల మధ్య అర్ధరాత్రి 12.15 గంటల సమయంలో...