ఎల్నీనో ప్రభావాన్ని ఎదుర్కొనేలా గ్రామస్థాయిలో కార్యాచరణ
నీటి పొదుపు, భూగర్భ జలాల పెంపునకు ప్రాధాన్యం.. సర్పంచులు, కార్యదర్శులకు శిక్షణ మహబూబాబాద్, సెప్టెంబరు 26 (చైతన్యగళం): ఎల్నీనో ప్రభావం నేపథ్యంలో నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ పంటల సాగును ప్రోత్సహించాలని, భూగర్భ జలాల పెంపునకు గ్రామస్థాయిలో సమగ్ర చర్యలు చేపట్టాలని ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్ సూచించారు. వి.బి.జి. రామ్‌జీ పథకం, ఎల్నీనో పరిస్థితులపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శనివారం మహబూబాబాద్‌లోని పీఎస్‌ఆర్ గార్డెన్‌లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్రునాయక్ మాట్లాడుతూ ఎల్నీనో ప్రభావంతో నీటి లభ్యతపై ఒత్తిడి...