ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన సమాజం

రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలి.. క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలి: కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ మహబూబాబాద్‌, సెప్టెంబరు 26 (చైతన్యగళం): ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంతో పాటు ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు దోహదపడుతుందని జిల్లా కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ అన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లేలా వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలోని జైపాల్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో జాతీయ మిషన్‌ ప్రకృతి వ్యవసాయం ఆధ్వర్యంలో 17...