CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 8:24 pm Posted by : CHAITHANYA GALAM NEWS

షార్ట్‌ఫిల్మ్‌ పోటీలో జీడీసీ హయత్‌నగర్‌ విద్యార్థికి ప్రథమ బహుమతి

  • ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో విద్యార్థుల ఉత్సాహభరిత పాల్గొనడం

హయత్‌నగర్‌, సెప్టెంబరు 26 (చైతన్యగళం‌): శిల్పారామంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హయత్‌నగర్‌కు చెందిన యువ పర్యాటక క్లబ్‌ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కళాశాల నుంచి సుమారు 100 మంది విద్యార్థులు రెండు బస్సుల్లో అధ్యాపకులతో కలిసి కార్యక్రమానికి హాజరయ్యారు. పర్యాటకం, చారిత్రక వారసత్వం, కళలు, హస్తకళలు, తెలంగాణ సంస్కృతిపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన కలిగింది.

ఈ సందర్భంగా నిర్వహించిన షార్ట్‌ఫిల్మ్‌ పోటీలో జీడీసీ హయత్‌నగర్‌ విద్యార్థి ఉపేందర్‌ రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి సాధించారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా ఉపేందర్‌ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సురేష్‌బాబు, అధ్యాపకులు, విద్యార్థులు ఉపేందర్‌ను అభినందించారు. జిల్లా, రాష్ట్రస్థాయి యువ పర్యాటక క్లబ్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఇతర విద్యార్థులకు కూడా బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

కార్యక్రమంలో మ్యూజియంల శాఖ డైరెక్టర్‌ (ఎఫ్‌ఏసీ) ప్రొఫెసర్‌ అర్జున్‌రావు కుతాడి పర్యాటక రంగ అభివృద్ధి, చారిత్రక వారసత్వ పరిరక్షణ, తెలంగాణ సంస్కృతి, యువత పాత్రపై ప్రసంగించారు. జిల్లా కో-ఆర్డినేటర్‌ మెహబూబ్‌, కళాశాల కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ నోముల వెంకటేశ్వర్లు, డాక్టర్‌ కృష్ణమోహన్‌, లెఫ్టినెంట్‌ డాక్టర్‌ ధన్‌రాజ్‌, డాక్టర్‌ దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.