CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 9:14 pm Posted by : CHAITHANYA GALAM NEWS

వ్యభిచార కార్యకలాపాలపై పోలీసుల దాడులు

  • ఐదుగురు నిర్వాహకులు, ముగ్గురు కస్టమర్లపై కేసులు

హుస్నాబాద్‌, సెప్టెంబరు 25 (చైతన్యగళం‌): హుస్నాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. సీఐ శ్రీధర్‌ ఆధ్వర్యంలో హుస్నాబాద్‌ ఎస్‌ఐ పి. లక్ష్మారెడ్డి, అక్కన్నపేట ఎస్‌ఐ సీహెచ్‌. ప్రశాంత్‌ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా వ్యభిచార కార్యకలాపాలతో సంబంధం ఉన్నట్లు గుర్తించిన కంసాని ఐశ్వర్య, కంసాని శ్రీధర్‌, కంసాని రమేష్‌, కంసాని సుజాతతో పాటు మరో వ్యక్తిపై, అలాగే ముగ్గురు కస్టమర్లపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనైతిక రవాణా నిరోధక చట్టం-1956లోని సంబంధిత నిబంధనల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.

వ్యభిచార గృహాల నిర్వహణ, వ్యక్తులను వ్యభిచారంలోకి ప్రలోభపెట్టడం లేదా తీసుకురావడం వంటి చర్యలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నిబంధనలకు లోబడి కస్టమర్లపై కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.