ఐలమ్మ జయంతి ఉత్సవాల రాష్ట్ర కన్వీనర్‌గా పగడాల లింగయ్య

మర్రిగూడ, సెప్టెంబరు 25 (చైతన్యగళం): వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి ఉత్సవాల రాష్ట్ర కన్వీనర్‌గా మర్రిగూడ గ్రామానికి చెందిన పగడాల లింగయ్యను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న జయంతి ఉత్సవాల నిర్వహణలో ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ సందర్భంగా పగడాల లింగయ్య మాట్లాడుతూ.. రజాకారులు, భూస్వాములు, దొరల పెత్తనానికి ఎదురొడ్డి పేద ప్రజల కోసం నిరంతరం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకురాలని కొనియాడారు. తనను రాష్ట్ర కన్వీనర్‌గా నియమించేందుకు సహకరించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి,...