CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 5:10 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఐలమ్మ జయంతి ఉత్సవాల రాష్ట్ర కన్వీనర్‌గా పగడాల లింగయ్య

మర్రిగూడ, సెప్టెంబరు 25 (చైతన్యగళం): వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి ఉత్సవాల రాష్ట్ర కన్వీనర్‌గా మర్రిగూడ గ్రామానికి చెందిన పగడాల లింగయ్యను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న జయంతి ఉత్సవాల నిర్వహణలో ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

ఈ సందర్భంగా పగడాల లింగయ్య మాట్లాడుతూ.. రజాకారులు, భూస్వాములు, దొరల పెత్తనానికి ఎదురొడ్డి పేద ప్రజల కోసం నిరంతరం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకురాలని కొనియాడారు. తనను రాష్ట్ర కన్వీనర్‌గా నియమించేందుకు సహకరించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, జక్కలి ఐలయ్య యాదవ్‌, కొండూరు సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు.