వైద్య పీజీ ప్రవేశ పరీక్షలో సత్తా చాటిన డాక్టర్ జ్యోతిర్మయి
7,346వ ర్యాంకు సాధించినందుకు ఆర్యవైశ్య సంఘం ఘన సన్మానం మహబూబాబాద్, సెప్టెంబర్ 25(చైతన్యగళం): ఆల్ ఇండియా మెడికల్ పీజీ ప్రవేశ పరీక్షలో 7,346వ ర్యాంకు సాధించిన మహబూబాబాద్‌కు చెందిన డాక్టర్ జ్యోతిర్మయిని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ జ్యోతిర్మయిని శాలువాతో సత్కరించి, పూలమాలలు, మెమొంటోతో అభినందించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. జ్యోతిర్మయి సాధించిన ర్యాంకు ఆమె ప్రతిభ, పట్టుదల, కృషికి నిదర్శనమని కొనియాడారు. వైద్య విద్యలో ఉన్నత స్థాయికి...