CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 5:01 pm Posted by : CHAITHANYA GALAM NEWS

దేశ రక్షణ మోదీతోనే సాధ్యం – బీజేపీ పట్టణ ఇన్‌చార్జి ఎల్ది మల్లయ్యగౌడ్‌

మహబూబాబాద్‌, సెప్టెంబరు 25 (చైతన్యగళం): దేశ రక్షణ, భద్రత, ప్రజా సంక్షేమం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే సాధ్యమని బీజేపీ మహబూబాబాద్‌ పట్టణ ఇన్‌చార్జి ఎల్ది మల్లయ్యగౌడ్‌ అన్నారు. ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా శుక్రవారం మహబూబాబాద్‌ ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మల్లయ్యగౌడ్‌ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ మోదీ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. దేశ భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఉగ్రవాద ముప్పును ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని అన్నారు.

కార్యక్రమంలో బీజేపీ సీనియర్‌ నాయకులు ముల్లంగి ప్రతాప్‌రెడ్డి, రేష్మా, కౌన్సిలర్‌ శ్రీదేవి బాలునాయక్‌, పట్టణ ప్రధాన కార్యదర్శి రవినాయక్‌, ఉపాధ్యక్షుడు రవి యాదవ్‌, చుక్కల నరేష్‌, శ్యామ్‌, మల్లం యశ్వంత్‌ తదితరులు పాల్గొన్నారు.