ఎండిపోతున్న పంటలను కాపాడాలని సీపీఎం ధర్నా

మర్రిగూడ, సెప్టెంబరు 25 (చైతన్యగళం): వ్యవసాయానికి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేసి, ఎండిపోతున్న పంటలను కాపాడాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం మర్రిగూడ మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సబ్‌స్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్‌ జక్కర్తి శ్రీనివాసులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. వరి నాట్లు వేసిన రైతులు విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విద్యుత్‌ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని...