CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 4:21 pm Posted by : CHAITHANYA GALAM NEWS

విద్యుత్‌ షాక్‌తో ఆవు మృతి

  • నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్‌ తీగలు ఏర్పాటు చేశారని బాధితుడి ఆరోపణ

కోహెడ, సెప్టెంబరు 25 (చైతన్యగళం): విద్యుత్‌ షాక్‌కు గురై ఆవు మృతి చెందిన ఘటన కోహెడ మండలం ఆరేపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. బాధితుడు గోండా ప్రశాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ సమీపంలోని ఓ రైతు తన పంట పొలానికి విద్యుత్‌ తీగలను ఏర్పాటు చేసుకున్నాడు. సాయంత్రం ఆవు పంట పొలం వైపు వెళ్లగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ తీగలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది.

పంట పొలానికి నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్‌ తీగలు ఏర్పాటు చేయడం వల్లే ఆవు మృతి చెందిందని గోండా ప్రశాంత్‌ ఆరోపించారు. ఆవు మృతితో తాను ఆర్థికంగా నష్టపోయానని, ప్రభుత్వం స్పందించి తగిన ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరారు.