- వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్యగౌడ్, డీసీసీ ఉపాధ్యక్షుడు యెన్నం భూపతిరెడ్డి
వెల్దండ, సెప్టెంబరు 25 (చైతన్యగళం): అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని వెల్దండ గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్యగౌడ్, డీసీసీ ఉపాధ్యక్షుడు యెన్నం భూపతిరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా వెల్దండ మండల కేంద్రానికి చెందిన కదమంచి సత్యమ్మకు మంజూరైన ఇంటి నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ నిర్వహించి పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎర్ర శ్రీను, కార్యదర్శి గిరిగౌడ్, వార్డు సభ్యులు పిల్లి దేవేందర్, పసునోజు వాణి, పురుషోత్తం, మారేపల్లి మంజుల శ్రీను, మాజీ ఉపసర్పంచ్ క్యాసరపు వెంకటయ్య, బయ్య మల్లయ్య, ఎం.డి.రషీద్, జిల్లా సేవాదళ్ ఉపాధ్యక్షుడు కొయ్యల పుల్లయ్య, తిరుపతిరెడ్డి, ఎం.డి.హమీద్, పుట్ట యాదయ్య, తుంగ శ్రీను, మట్ట మల్లేష్, సాంబ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.