పల్లె ప్రకృతి వనం దారి అధ్వానం
వర్షం పడితే రోడ్డుపై నీరు.. ఇబ్బందుల్లో ప్రజలు కోహెడ, సెప్టెంబరు 24 (చైతన్యగళం): సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనానికి వెళ్లే దారి అధ్వానంగా మారింది. వర్షం కురిసిన ప్రతిసారీ సీసీ రోడ్డుపై నీరు నిలిచి మడుగులను తలపిస్తోంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే విద్యార్థులు, పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని, పాదచారులు నడిచి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా...