CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 4:31 pm Posted by : CHAITHANYA GALAM NEWS

పల్లె ప్రకృతి వనం దారి అధ్వానం

  • వర్షం పడితే రోడ్డుపై నీరు.. ఇబ్బందుల్లో ప్రజలు

కోహెడ, సెప్టెంబరు 24 (చైతన్యగళం): సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనానికి వెళ్లే దారి అధ్వానంగా మారింది. వర్షం కురిసిన ప్రతిసారీ సీసీ రోడ్డుపై నీరు నిలిచి మడుగులను తలపిస్తోంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే విద్యార్థులు, పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని, పాదచారులు నడిచి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వర్షపు నీరు నిలవకుండా చర్యలు చేపట్టి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.