ఎన్ఎస్ఎస్‌ సేవా స్ఫూర్తిని విద్యార్థులు అలవర్చుకోవాలి: ప్రిన్సిపల్‌ చెన్నూరి గంగాధర్‌

హుస్నాబాద్‌, సెప్టెంబరు 24 (చైతన్యగళం): విద్యార్థులను సామాజిక సేవలో భాగస్వాములుగా తీర్చిదిద్దడంతో పాటు వారి వ్యక్తిత్వ వికాసానికి కృషి చేయడంలో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్‌) పాత్ర కీలకమని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ చెన్నూరి గంగాధర్‌ అన్నారు. కళాశాలలో గురువారం నిర్వహించిన ఎన్ఎస్ఎస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. 1969లో ప్రారంభమైన ఎన్ఎస్ఎస్‌ విద్యార్థుల్లో సేవాభావాన్ని పెంపొందించడంతో పాటు నిరాశ, నిస్పృహలకు లోనుకాకుండా, హింసకు దూరంగా ఉండేలా మార్గనిర్దేశం చేస్తోందన్నారు. విద్యార్థి దశలోనే సేవాభావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ‘నా కోసం...