రేకొండ రైతులకు పట్టాలు ఇవ్వాలి
రెవెన్యూ మంత్రి పొంగులేటికి మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి వినతి చిగురుమామిడి, సెప్టెంబరు 24 (చైతన్యగళం): కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలోని సర్వే నంబర్ 927తో పాటు ఇతర సర్వే నంబర్లలో దీర్ఘకాలంగా సాగు చేసుకుంటున్న రైతులకు భూములపై పట్టాలు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని సచివాలయంలో రేకొండ రైతులతో కలిసి మంత్రికి వినతిపత్రం అందజేశారు. రేకొండలో పలువురు రైతులు, వారి కుటుంబాలు సుమారు 60 ఏళ్లుగా...