ఘనంగా ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
సామాజిక సేవలో వాలంటీర్లు చురుగ్గా పాల్గొనాలి: ప్రిన్సిపల్ వి.లలిత హుస్నాబాద్, సెప్టెంబరు 24 (చైతన్యగళం): ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్, ఎన్ఎస్ఎస్ చైర్మన్ వి.లలిత అధ్యక్షతన అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థినులు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వి.లలిత మాట్లాడుతూ.. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అంకితభావంతో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. స్వచ్ఛభారత్ కార్యక్రమాలు, సామాజిక అవగాహన...