గుంటిపెల్లి దుర్గేష్‌ పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దాం

ఏడో వర్ధంతి సభలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి గడిపె మల్లేశ్‌ హుస్నాబాద్‌, సెప్టెంబరు 24 (చైతన్యగళం): పేదలు, బడుగు వర్గాలకు న్యాయం జరిగే వరకు పోరాడిన గుంటిపెల్లి దుర్గేష్‌ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి గడిపె మల్లేశ్‌ పిలుపునిచ్చారు. దుర్గేష్‌ ఏడో వర్ధంతిని పురస్కరించుకుని అనభేరి–సింగిరెడ్డి అమరుల భవనంలో సీపీఐ మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేశ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తహసీల్దార్‌ కార్యాలయ ముట్టడి, కొత్తచెరువు శిఖం...