కేంద్ర నిధుల రోడ్లకు కాంగ్రెస్ క్రెడిట్ సరికాదు- రామంచ మహేందర్‌రెడ్డి
అక్కన్నపేట, సెప్టెంబరు 24 (చైతన్యగళం): కేంద్ర నిధులతో మంజూరైన రోడ్లకు కాంగ్రెస్ నాయకులు క్రెడిట్ తీసుకోవడం సరికాదని అక్కన్నపేట మండల బీజేపీ అధ్యక్షుడు రామంచ మహేందర్‌రెడ్డి అన్నారు. బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు వాస్తవాలు వెల్లడిస్తే.. కాంగ్రెస్ మండల నాయకులు అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు. తమ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతకపేట నుంచి భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వరకు, హుస్నాబాద్ నుంచి రామవరం వరకు సీఐఆర్‌ఎఫ్ నిధులతో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ రోడ్లు...