మౌంట్ సరమతి అధిరోహించిన భూక్య యశ్వంత్
‘హర్ శిఖర్ పర్ తిరంగా’లో మరో మైలురాయి మహబూబాబాద్, సెప్టెంబర్ 24(చైతన్యగళం): మహబూబాబాద్ జిల్లా భూక్య తండాకు చెందిన భారత పర్వతారోహకుడు భూక్య యశ్వంత్ మరో ఘనత సాధించారు. ‘హర్ శిఖర్ పర్ తిరంగా–సెవెన్ సిస్టర్స్ ఎక్స్‌పెడిషన్’లో భాగంగా నాగాలాండ్ రాష్ట్రంలోని అత్యంత ఎత్తైన శిఖరం **మౌంట్ సరమతి (3,841 మీటర్లు)**ను సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం విజయవంతంగా అధిరోహించారు. శిఖరాగ్రంపై జాతీయ జెండాను ఎగురవేసి నాగాలాండ్ అధ్యాయాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. మేఘాలయలోని షిల్లాంగ్ నుంచి ప్రారంభమైన యశ్వంత్ బృందం నాగాలాండ్‌లోని...