రూ.90,116కు వినాయకుడి లడ్డూ ప్రసాదం వేలం

ఎడ్ల ప్రవీణ–రమేష్‌ దంపతులకు దక్కిన లడ్డూ మహబూబాబాద్‌, సెప్టెంబరు 23 (చైతన్యగళం): మహబూబాబాద్‌ పట్టణంలోని యు హౌసింగ్‌ బోర్డు కాలనీలో వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ వేలం పాట ఉత్సాహభరితంగా సాగింది. కాలనీ వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేలం పాటలో ఆసక్తిగా పాల్గొన్నారు. వినాయకుడి లడ్డూ ప్రసాదాన్ని ఎడ్ల ప్రవీణ–రమేష్‌ దంపతులు రూ.90,116కు వేలంలో దక్కించుకున్నారు. భక్తిశ్రద్ధలతో వేలంలో పాల్గొని లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకోవడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు దంపతులను...